![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -649 లో.....ఇందిరాదేవి సీతారామయ్యలు కలిసి రుద్రాణి రాహుల్ లని ఇంట్లో నుండి పంపించాలని నిర్ణయం తీసుకుంటారు. దాంతో ఇక ఇగోకి పోతే నడవదని రుద్రాణి సీతారామయ్య కాళ్ళపై పడి రిక్వెస్ట్ చేస్తుంది. ఇన్ని రోజులు మీరే పెంచి పోషించారు.. ఇప్పుడు మమ్మల్ని బయటకు వెళ్ళమంటే ఎలా బ్రతుకుతాం.. స్వప్న తన కూతురు మొహం చూసి అయిన మమ్మల్ని వదిలి పెట్టండి అని రుద్రాణి అనగానే.. అంత లేదు మాకు తాతయ్య ఇచ్చిన ఆస్తులున్నాయ్.. మేం ఇక్కడే ఉంటాం.. వాళ్ళు వెళ్ళమనేది మిమ్మల్ని అని స్వప్న అంటుంది.
అక్క నువ్వు సైలెంట్ గా ఉండు పాపకి తండ్రి కావాలని కావ్య అంటుంది. అయితే ఒక రాహుల్ ని ఉంచండి అని స్వప్న అంటుంది. ఈ ఒక్కసారి క్షమించండి అన్నట్లు సీతారామయ్యతో కావ్య చెప్తుంది. ఇక ఇంట్లో గొడవలకి కారణం అవ్వదు కదా అని ఇందిరాదేవి అనగానే.. అవ్వను.. ఇక నా వాళ్ల ఏ గొడవ జరగదని రుద్రాణి అనగానే ఇందిరాదేవి, సీతారామయ్య ఒప్పుకుంటారు. ఆ తర్వాత రుద్రాణి కోపంగా గదిలోకి వెళ్లి ఇంట్లో నుండి పంపిస్తారా అంటూ వస్తువులు విసిరేస్తుంటే రాహుల్ వచ్చి ఆపుతాడు. అప్పుడే స్వప్న వచ్చి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చి వెళ్తుంది. నువ్వు చాలా గ్రేట్ రా భార్యని పోలీస్ ఆఫీసర్ ని చేసావని కళ్యాణ్ ని రాజ్ మెచ్చుకుంటాడు. అప్పుడే ధాన్యలక్ష్మి వస్తుంది. ఊళ్ళో వాళ్ళని ఉద్దరించడం కాదు తను కూడ గొప్ప స్థాయిలో ఉండాలి.. పేపర్ లు చూసుకొని మురిసిపోకుండా తన గురించి గొప్పగా పేపర్ లో రావాలి.. ఒకరి కిందపని చేస్తే పనివాడు అంటాడు.. లేదంటే రాజు అంటారని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వేం బాధపడకురా పిన్ని గురించి తెలుసు కదా అని కళ్యాణ్ తో రాజ్ అంటాడు.
అదంతా అప్పు వింటుంది. బయట కూర్చొని ఏడుస్తుంటే.. అప్పుడే కావ్య వచ్చి మాట్లాడుతుంది. ఆవిడ అన్న మాటల్లో కూడా న్యాయం ఉంది కదా అని అప్పు అంటుంది. కళ్యాణ్ లిరిక్ రైటర్ దగ్గర పని చెస్తున్నాడు కదా అతను తన దగ్గరే వర్క్ చెయ్యాలని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. అలా అయితే కళ్యాణ్ ఎలా ఎదుగుతాడు. నువ్వు కళ్యాణ్ కి తెలియకుండా లిరిక్ రైటర్ పని చెప్పమని కావ్య చెప్పగానే.. వాడి సంగతి చెప్తానంటు అప్పు అంటుంది. మరొకవైపు నీ వల్ల.. నువ్వు చెప్పింది చేస్తూ కోట్లు పోగొట్టుకున్నానని అనామిక చెంపచెల్లుమనిపిస్తాడు సామంత్. దాంతో నీ సంగతి, ఆ రాజ్ సంగతి చెప్తానని అనామిక అనుకుంటుంది. ఆ తర్వాత కావ్య ఫ్రూట్స్ అన్ని ఒక బాస్కెట్ లో సర్దుతు ఉంటే అప్పుడే రాజ్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |